- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోల్డ్ లుక్‌లో ప్రభాస్ హీరోయిన్.. 42 ఏళ్ల వయసొచ్చినా తగ్గని అందం
అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.
ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు.
42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో స్కిన్ కలర్ డ్రెస్‌లో బోల్డ్ షో చేసింది. ఎద అందాలు కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు సూపర్, గార్జియస్, బ్యూటి ఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






