ప్రభాస్ మంచి మనసు.. తండ్రి చనిపోయిన దుఖంలోనూ రచయితకు సాయం.. నెట్టింట ప్రశంసల వర్షం

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘కల్కీ’(Kalki) మూవీతో బ్లాక్ విజయం సాధించాడు.

ప్రభాస్ మంచి మనసు.. తండ్రి చనిపోయిన దుఖంలోనూ రచయితకు సాయం.. నెట్టింట ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘కల్కీ’(Kalki) మూవీతో బ్లాక్ విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. ‘కల్కీ-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘ఫౌజీ’(Fouji), ‘స్పిరిట్’(Spirit) వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన హీరోగానే కాకుండా బయట కూడా చాలా మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

అలాగే సినిమా షూటింగ్ సెట్స్‌లో ప్రతి ఒక్కరికి తన ఇంటి నుంచి భోజనం పంపించి గుడ్ హార్ట్ అనిపించుకుంటున్నాడు. అంతేకాకుండా తన ఫ్యాన్స్‌కు మనీ ఇచ్చి ఆపదలో ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అతనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినీ రచయిత తోట ప్రసాద్(thota Prasad) మన డార్లింగ్ ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను 2010 ఫిబ్రవరిలో ఆస్పత్రి పాలయ్యాను. అదే రోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు(Surya Narayana Raju) గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నా పట్ల అంత కేర్ తీసుకున్నారాయన.

తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు. అతను చేసిన సహాయానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తోట ప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇది విన్న నెటిజన్లు, ఫ్యాన్స్ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story