- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
The Raja Saab: థియేటర్ లోకి మొసళ్లు..ప్రభాస్ ఫ్యాన్స్ అరాచకం
ప్రభాస్ ఫ్యాన్స్ ఓ థియేటర్ లోకి ప్లాస్టిక్ మొసళ్లను కూడా తీసుకువచ్చారు. పెద్ద సైజులో ఉన్న ఈ మొసళ్లను తీసుకువచ్చి థియేటర్ లో చిందులు వేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్, మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. ఓవర్ సీస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్లు ప్రారంభం కాగా తెలంగాణలో మాత్రం పర్మిషన్లు రాలేదు. దీంతో ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు తెలంగాణలో పడలేదు. కేవలం మీడియా వాళ్లకు మాత్రమే బాలానగర్ విమల్ థియేటర్ లో వేసినట్లు సమాచారం.
అయితే ప్రీమియర్లు పడ్డచోట ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై ప్రభాస్ ను చూసుకున్న ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఓ థియేటర్ లోకి ప్లాస్టిక్ మొసళ్లను కూడా తీసుకువచ్చారు. పెద్ద సైజులో ఉన్న ఈ మొసళ్లను తీసుకువచ్చి థియేటర్ లో చిందులు వేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు మెంటల్ రెబల్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నారు.
ది రాజా సాబ్ ఎలా ఉందంటే ?
కాసేపటి క్రితమే ది రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. సినిమాపై ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రారంభంలోనే హారర్ అంశాలు కనిపిస్తాయట. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ రాగానే రెబల్ సాబ్ అనే సాంగ్ వస్తుందట. ఆ తర్వాత ముగ్గురు హీరోయిన్లు పరిచయం అవుతారట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, మాళవిక మధ్య కొన్ని ఫన్నీ మూమెంట్స్ తర్వాత కథ సీరియస్ లోకి వెళ్తుందని పోస్టులు పెడుతున్నారు. క్లిక్






