- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మజాకా’ నుంచి ప్రభాస్ బ్యూటీ పోస్టర్ రిలీజ్.. పెళ్లి కూతురి గెటప్‌లో మామూలుగా లేదుగా(ట్వీట్)
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) నటిస్తున్న తాజా సినిమా ‘మజాకా’(Majaka).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) నటిస్తున్న తాజా సినిమా ‘మజాకా’(Majaka). ఇక ఈ చిత్రంలో సందీప్ సరసన రీతు వర్మ(reethu Varma) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సీనియర్ యాక్టర్ రావు రమేష్(rao Ramesh), అలనాటి హీరోయిన్ అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక రవితేజ ‘ధమాకా’ మేకర్ త్రినాధరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్(Umesh KR Bansal) నిర్మిస్తున్నారు.
కాగా బాలాజీ గుత్తా(Balaji Gutha) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ మూవీనుంచి ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser) ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. తాజాగా నేడు సీనియర్ హీరోయిన్ అన్షు పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈ బ్యూటీకి విషెస్ తెలుపుతూ యశోద క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. పెళ్లి కూతురి గెటప్‌లో అన్షూ సూపర్‌గా ఉంది. కళ్లకు స్పెక్ట్స్ పెట్టుకుని అయ్యో రామ అన్నట్టుగా నెత్తి మీద చేయి పెట్టుకుని నవ్వుతూ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఆకట్టుకోగా.. ఈ బ్యూటీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
కాగా అన్షు.. ప్రభాస్(Prabhas) సరసన ‘ఈశ్వర్’(Eshwar) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత నాగార్జున(Nagarjuna) సరసన ‘మన్మధుడు’(Manmadhudu) సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత మరో మూవీ చేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. మళ్లీ ఇన్నేళ్లుకు ‘మజాకా’ మూవీతో ఆడియన్స్‌ని అలరించడానికి రానున్నది.






