- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Thalapathy Vijay: విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో ప్రభాస్ బ్యూటీ ఫిక్స్.. హైప్ పెంచుతున్న ట్వీట్

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) గత ఏడాది ‘ది గోట్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విజయ్ కెరీర్‌లో చివరగా నటిస్తున్న సినిమా ‘జన నాయగన్’(Jana Nayagan). ఈచిత్రానికి ఎచ్. వినోద్(H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, బాబీ డియోల్(Bobby Deol), ప్రియమణి, మమిత బైజు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. విజయ్ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా కనిపించనుంది.
దీనిని కెవిఎన్ బ్యానర్‌పై జగదీష్ పాలసామి, లోహిత్, వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ‘జన నాయగన్’ నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇటీవల వచ్చిన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీ పెంచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా నటించనున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతూ ‘జన నాయగన్’మూవీపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. కాగా విజయ్, శృతి కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు. వీరిద్దరు కలిసి ‘పులి’ చిత్రంతో నటించారు. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత నటిస్తుండటం విశేషం. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, శృతి హాసన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శృతి ‘జన నాయగన్’తో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’చిత్రంలోనూ నటిస్తోంది. షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజ బిజీగా గడుపుతోంది.
— Let's X OTT GLOBAL (@LetsXOtt) February 8, 2025