మళ్లీ తెరపైకి 'పవర్‌పేట'... ప్రాజెక్టులోకి ఇద్దరు క్రేజీ టెక్నీషియన్స్

by Pulgam srinivas |

'పవర్ పేట'లోకి ఇద్దరు క్రేజీ టెక్నీషియన్స్

మళ్లీ తెరపైకి పవర్‌పేట... ప్రాజెక్టులోకి ఇద్దరు క్రేజీ టెక్నీషియన్స్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ‘రౌడీ ఫెలో’ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఈయన ‘ఛల్ మోహన్ రంగ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. చాలా కాలంగా ఈ దర్శకుడు ‘పవర్ పేట’ అనే సినిమాను రూపొందించాలనే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హీరో నితిన్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందనే వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

అయితే ఈ దర్శకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాను తెరకెక్కించాలనే పట్టుదలతో పలువురు హీరోలను సంప్రదించాడు. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. చివరికి యువ హీరో సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్‌లోకి ఇద్దరు క్రేజీ టెక్నీషియన్స్ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మాధీ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు సమాచారం. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతూ వచ్చిన ‘పవర్‌పేట’ ప్రాజెక్ట్‌పై మళ్లీ సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

Next Story