- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘VD-15’ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. లీక్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల నటించిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’(Family Star).

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల నటించిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్’(Family Star). ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి మెప్పించలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’, VD14, వంటి చిత్రాలతో రాబోతున్నారు. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘VD-15’ చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కింగ్‌డమ్’ పూర్తి అయ్యాక విజయ్ ఈ సినిమా సెట్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు చిత్రబృందం. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు ‘VD-15’టైటిల్‌ను లీక్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాకు ‘రౌడీ జనార్ధన్’ అనే పవర్ ఫుల్ పేరును ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. అలాగే ఎల్లమ్మ, వీడీ-15 పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇంతవరకు చెప్పలేదు కదా అని నవ్వేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.
#VijayDeverakonda, #Nithiin సినిమాల టైటిల్స్ లీక్ చేసిన #DilRaju 😂#RowdyJanardana #Yellamma #SeethammaVakitloSirimalleChettu #TeluguFilmNagar pic.twitter.com/LcHmzvgRve
— Telugu FilmNagar (@telugufilmnagar) March 5, 2025






