- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Gopichand 33'కు పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్?
'గోపీచంద్ 33'వ చిత్రానికి ‘భారత వర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గతంలో ‘ఘాజీ’ వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ అధికారికంగా ఖరారు చేయలేదు. దాంతో ‘గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు టైటిల్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు, దానిని మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 7వ శతాబ్దపు యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను అక్టోబర్ 18, 2026న విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనుండగా, శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






