శర్వానంద్ ‘భోగి’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

శర్వానంద్ ‘భోగి’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) అనే చిత్రం నేడు రిలీజ్ కాగా.. ప్రజెంట్ శర్వానంద్ సంపత్ నంది(Sampath Nandi) డైరెక్షన్‌లో 'భోగి'(Bhogi) అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ సమర్పిస్తున్నారు.

1960 బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రల కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్(anupama Parameswaran), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

అయితే నేడు భోగి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘గతాన్ని బూడిదగా మార్చనివ్వండి మరియు అగ్ని భయంకరమైనదాన్ని ఏర్పరుస్తుంది. టీం భోగి మీ అందరికీ శక్తివంతమైన మరియు సంపన్నమైన భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతుంది’ అని రాసుకొస్తూ మంటలతో హ్యాపీ భోగీ అని రాసిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Next Story