- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు 1న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు'.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు (Harihara Veeramallu)'. ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఇక ఎంతో కాలం ఎదురుచూపులనంతరం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. పలు కారణాల వల్ల హిందీ వర్షన్ రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. అయితే, తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ విడుదలపై చిత్రబృందం అప్‌డేట్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి హరిహర వీరమల్లు మూవీ హిందీలో విడుదల కానుంది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






