- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టుకు హాజరైన ప్రముఖ తెలుగు హీరో
ప్రముఖ తెలుగు హీరో, నిర్మాతలు నేడు ఏపీలోని మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు హీరో, నిర్మాతలు నేడు ఏపీలోని మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి, తెలుగు సినీ నటుడు సుమంత్(Sumanth), అక్కినేని నిర్మాత సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) కోర్టులో హాజరయ్యారు. 2016లో విడుదలైన "నరుడా డోనరుడా" సినిమాకు సంబంధించిన ఆర్థిక వివాదంతో ముడిపడి ఉంది. ఈ చిత్రం బాలీవుడ్ సినిమా "విక్కీ డోనర్" రీమేక్ గా "నరుడా డోనరుడా" పేరుతో 2016 లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సుమంత్ హీరోగా నటించారు.
మార్కాపురం నివాసి, సహ నిర్మాత కరుమంచి శ్రీనివాస రావు ఈ సినిమా నిర్మాణంలో ఆర్థికంగా సహకరించారు. అయితే, నిర్మాతలు శ్రీనివాస రావుకు చెల్లించిన చెక్ బౌన్స్ కావడంతో, ఆయన మార్కాపురం కోర్టులో చెక్ బౌన్స్ కేసు (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 సెక్షన్ 138 కింద) దాఖలు చేశారు. ఈకేసులో సుమంత్, సుప్రియ హైదరాబాద్ నుంచి తమ న్యాయవాదులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.






