- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sonu Nigam: హాస్పిటల్ బెడ్ పై ప్రముఖ బాలీవుడ్ సింగర్ .. ఆందోళనలో ఫ్యాన్స్ ( వీడియో )
మీ బాధ మేము చూడలేకపోతున్నామంటూ కొందరు అతడికి సపోర్ట్ చేస్తున్నారు

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలోని సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ సింగర్స్ లో సోనూ నిగమ్ ( Sonu Nigam ) కూడా ఒకరు. ఇతను హిందీలో ఇప్పటివరకు ఎన్నో హిట్ పాటలను పాడాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇతను టాప్ సింగర్ గా ఉన్నారు. ఇటీవలే సింగర్ అర్జిత్ సింగ్ కు పద్మ శ్రీ అవార్డ్ రావడంపై తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో విమర్శలకు గురయ్యాడు. ఇదిలా ఉండగా.. తాజాగా, సోనూ నిగమ్ హోస్పిటల్లో చేరారు. ఆదివారం జరిగిన లైవ్ ఈవెంట్ లో అస్వస్థతకు గురయ్యాడు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
లైవ్ ఈవెంట్ సమయంలో వెన్నునొప్పి తీవ్రంగా వస్తున్నా కూడా అతడు తన ప్రదర్శనను ఆపకుండా చేశారు. నొప్పి మరింత తీవ్రం కావడంతో ఈవెంట్ ఐపోయాక ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యం గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు.
ఇప్పటివరకు సోనూ నిగమ్ ఎన్నో హిట్ పాటలనందించారు. అంతేకాదు.. అతనికి సొంతంగా బ్యాండ్ కూడా ఉంది. అయితే, గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించలేదు. ఆసుపత్రి బెడ్ పై నుంచి వీడియో షేర్ చేస్తూ తనకు ఏం జరిగిందో చెప్పాడు సోనూ నిగమ్. “ నా జీవితంలో ఇది చాలా కష్టమైన రోజు. నేను పాటలు పాడుతూ స్టేజ్ పైన చుట్టూ తిరుగుతున్నాను. అప్పుడు కొంచం నొప్పి వచ్చింది. చాలా మేనేజ్ చేశాను. వెన్నులో భరించలేని నొప్పి వచ్చింది. నా వీపులో ఎవరో ఇంజక్షన్ సూది వేసినట్లుగా అనిపించింది ” అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.
సోనూ నిగమ్ వీడియో చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని.. మీ బాధ మేము చూడలేకపోతున్నామంటూ కొందరు అతడికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం సోనూ నిగమ్ హెల్త్ సమస్యల పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సోనూ నిగమ్ హిందీలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళం లోనూ ఎన్నో పాటలు పాడారు.






