Gayatri Hazarika : ప్రముఖ సింగర్ కన్నుమూత

by Muthe.Rajitha |

ప్రముఖ అస్సామీ గాయని(Assami Singer) గాయత్రి హజారికాGayatri Hazarika(44) నేడు కన్నుమూశారు.

Gayatri Hazarika : ప్రముఖ సింగర్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ అస్సామీ గాయని(Assami Singer) గాయత్రి హజారికాGayatri Hazarika(44) నేడు కన్నుమూశారు. గత గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్ తో బాధపడుతున్న గాయత్రి.. శుక్రవారం గౌహతిలోని నేమ్‌కేర్ ఆసుపత్రిలో మధ్యాహ్నం 2:15 గంటలకు తుది శ్వాస విడిచారు. ‘సరా పాటే పాటే ఫాగున్ నామే’, ‘జోనాక్ నాశిల్ బనత్’, ‘ఆబేలిర్ హెంగులీ ఆకాశే’, ‘యేతియా జోనాక్ నామిశిల్’, ‘మాతో ఏజాక్ బరషున్’, ‘తోమాలై మోర్ మరమ్’ వంటి సుమధుర గీతాలతో అస్సామీ సంగీత రంగం(Assami Music)లో ఆమె అపారమైన గుర్తింపు సాధించారు. ఆమె కంఠం అస్సామీ సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని సంగీత ప్రియులు కొనియాడుతున్నారు.

ఆమె అకాల మరణం అస్సామీ సంగీత లోకానికి తీరని లోటుగా నిలిచిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Assam CM Himanta Biswa Sarma) తన ప్రగాఢ సంతాపం(Condolence) తెలిపారు. గాయత్రి హజారికా మరణం పట్ల పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం వ్యక్తం చేశారు.

Next Story