బేబీ బంప్‌తో పూనమ్ పాండే...మ‌రో నాట‌క‌మంటూ ట్రోల్స్ !

by velandi.Saikiran |

తాను ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించింది నటి పూనమ్ పాండే. ఈ మేరకు బేబీ బంప్ చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేసింది.

poonam pandey baby bump
X

poonam pandey baby bump

దిశ‌, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ( Poonam Pandey ) గురించి తెలియని వారు ఉండరు. నిత్యం పొట్టి బట్టలు వేస్తూ, యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూనే, బాంబు లాంటి వార్త వేసి మాయం అవుతుంది. అయితే తాజాగా నటి పూనమ్ పాండే గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

పూనమ్ పాండే ప్రెగ్నెంట్..ఫోటోలు వైర‌ల్

తాను ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ప్రకటించింది నటి పూనమ్ పాండే. ఈ మేరకు బేబీ బంప్ చూపిస్తూ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వీటిని చూసిన నెటిజెన్స్, పూనమ్ పాండేను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నువ్వు ఏది చెబితే అది న‌మ్మ‌డానికి ఏం ఏమైనా పిచ్చోళ్ల‌మా ? అంటూ సీరియ‌స్ అవుతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చింది కాబట్టి, అందర్నీ ఫూల్ చేసేందుకు ఈ ప్రెగ్నెంట్ డ్రామాలు ఆడుతోంద‌ని కౌంటర్ ఇస్తున్నారు జనాలు. పూన‌మ్ పాండే అంటేనే అబద్ధాల పుట్ట అంటూ ఫైర్ అవుతున్నారు. అందరిని ఫూల్స్‌ చేసేందుకు ఈ బేబీ బంప్ ఫోటోలను పంచుకుందని మండిప‌డుతున్నారు.

అప్ప‌ట్లో క్యాన్స‌ర్‌, ఇప్పుడు ప్రెగ్నెంట్

నటి పూనమ్ పాండే మరణించినట్లు అప్ప‌ట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి మాసంలో గర్భాశయ క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే మరణించినట్లు పోస్టు వైరల్ అయింది. ఈ పోస్ట్ కూడా పూనమ్ పాండే సోషల్ మీడియా అకౌంట్ నుంచే పోస్ట్ చేశారు. దీంతో అంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. అయితే ఆ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని కొత్త డ్రామాకు తెర లేపారు. క్యాన్సర్ పైన అవగాహన కల్పించేందుకు ఈ డ్రామా ఆడినట్లు వెల్లడించారు. దీంతో అప్పట్లో పూనమ్ పాండే వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.

Next Story