ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన పూనమ్ పాండే.. సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇచ్చేశావా అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |   (  Updated:2026-04-01 14:37:03  IST  )

నన్ను సీరియస్‌గా తీసుకోవండి.. లైఫ్‌ను చిల్ అవ్వండి అంటూ ప్రెగ్నెన్సీ వార్తలపై షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది నటి పూనమ్ పాండే.

ప్రెగ్నెన్సీ వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన పూనమ్ పాండే.. సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇచ్చేశావా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా, పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి అనుకునేలా వార్తల్లో నిలుస్తుంటుంది నటి పూనమ్ పాండే. గతంలో సర్వైకల్ క్యాన్సర్‌తో అవగాహన కల్పించేందుకంటూ తన చనిపోయినట్లు వార్తలు పుట్టించి ఈమె.. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అంటూ కొత్త డ్రామాను షురు చేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అయితే తన గురించి తెలిసిన వాళ్లు ఇది నిజమా, కాదా అనే సందేహంలో ఉండగా.. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు తాజాగా ఓ వీడియో షేర్ చేస్తూ.. తాను గర్భవతిని కాదని, అదంతా ఒక 'ఏప్రిల్ ఫూల్ ప్రాంక్' అని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అందరినీ కాసేపు అలరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిసింది. అలాగే ‘నన్ను సీరియస్‌గా తీసుకోవద్దు.. లైఫ్ ని చిల్ చేయండి’ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ‘అయ్యో నిజమా... సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్ ఇచ్చి నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావేమో అనుకున్నాము’ అంటూ సెటేరికల్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

Next Story