Pooja Hegde: ఇద్దరు స్టార్ హీరోలతో చిందులేయనున్న పూజా హెగ్డే

by Phanindra |

పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Pooja Hegde: ఇద్దరు స్టార్ హీరోలతో చిందులేయనున్న పూజా హెగ్డే
X

దిశ, వెబ్ డెస్క్ : పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉండగా .. ఈ మధ్య అవకాశాలు లేక ఇతర ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. అయితే, సూపర్ స్టార్ రజినికాంత్ తో చిందులేయడానికి రెడీ అవుతుంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కొన్ని మూవీస్ లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె కెరీర్‌ డౌన్ అయిపోయింది. దీంతో, ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేసింది. కానీ, అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.

ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో రెండు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ల సైన్ చేసినట్లుతెలిసిన సమాచారం. ఈ రెండు ఒకటి ‘జన నాయగణ్‌’ (Thalapathy Vijay), ‘కాంచన 4’(Kanchana 4). కాంచన కి ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. ఇక హీరో విజయ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అన్నీ హిట్లే. అయితే, ఇప్పుడు పూజాకు ఒక బంపరాఫర్ వచ్చినట్లు సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో పక్కన చేసే అవకాశం కొట్టేసింది. అది కూడా ఒక ఐటెం సాంగ్ చేయనుందని తెలిసిన సమాచారం. ఈ పాట ‘కూలీ’ చిత్రంలో ఉండబోతుంది, ఈ సాంగ్‌(Coolie Movie Item Song) లో రజనీకాంత్‌, నాగార్జున(Akkineni Nagarjuna) కూడా కనిపించనున్నారని టాక్. మరి, ఈ పాట హిట్ అవుతుందో ? లేదో చూడాల్సి ఉంది.

Next Story