- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగులో పూజా హెగ్డే సినిమా.. ఈసారైన హిట్ దక్కేనా?
వరుస పరాజయాలు ఎదుర్కొంటునప్పటికీ బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.

దిశ, సినిమా: వరుస పరాజయాలు ఎదుర్కొంటునప్పటికీ బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద హిట్లు లేకపోయిన బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు మాత్రం అమ్మడు చెంతుకు చేరుతున్నాయి. కోలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ ‘ఆచార్య’ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా అనౌన్స్ చెయ్యలేదు ఈ బ్యూటీ. 2022లో విడుదలైన ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది పూజా. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'DQ 41'. ఈ పాన్ ఇండియా ప్రేమకథకు రవి నెలకుడిటి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం ద్వారా పూజా మూడేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుంది. సుధాకర్ చెరుకూరి నర్మిస్తున్న 'DQ 41' కు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇది ఒక ఎమోషనల్ అన్‌కండిషనల్ ప్రేమకథ అని తెలుస్తుండగా.. ఈ సినిమాతో అయినా పూజా తెలుగులో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.






