- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వాకు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ!
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్నఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు టాక్.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా నంద్ ప్రస్తుతం ‘భోగి’తో బిజీగా ఉన్నాడు. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌లలో ఒకటిగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పలు అప్డేట్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. శర్వా మరో చిత్రానికి సిద్ధం అయ్యాడు. ఈ మేరకు దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలిపాడు. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో వస్తున్న ఈ క్లీన్ ఎంటర్టైనర్, సైన్స్ ఫిక్షన్ మూవీలో ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, సత్య, బుల్లి రాజు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. జూన్ లేదా జులై నుంచి షూటింగ్ ఉండచ్చని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. 2027 సంక్రాంతి టార్గెట్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ కోసం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.






