- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bunny Vas : రాజకీయాలు రొచ్చు : నిర్మాత బన్నీ వాస్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్(Bunny Vas) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్(Bunny Vas) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయల(Politics) రొచ్చులో సినిమా ఇండస్ట్రీ(Film Industry) నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా పని చేస్తాయని, లోతుగా ఉంటాయని అన్నారు. ఈ రొచ్చులో పడి ఇండస్ట్రీ నలుగుతున్న విషయాన్ని ఇప్పటికైనా మనం గ్రహించాలని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మేలన్నారు. మన సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి, ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన వ్యక్తిని కూడా ఇరిటేట్ చేసేంతకు దిగజారి పోయింది ఇండస్ట్రీ అని తెలిపారు.
ఇదే మన యూనిటీ అని, అందుకే మనకు ఇన్నీ సమస్యలు అని పేర్కొన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని నలుగురు మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు ఇటు ఏపీ రాజకీయాల్లో అటు సినిమా ఇండస్ట్రీలోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పవన్ పేషీ నుంచి నేడు ఓ సంచలన ప్రకటన వెలువడింది.
రాష్ట్రంలో కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయినప్పటికీ.. సినిమా వాళ్లలో ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. సినిమా రంగ అభివృద్ధికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే.. ఆయన సినిమాకే అడ్డంకులా? అని మండిపడ్డారు. చిత్రసీమలో కొందరి రిటర్న్ గిఫ్ట్‌కి థ్యాంక్స్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు ఉండబోవు అని సంచలన ప్రకటన చేశారు. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాల్సి ఉంటుందని కండీషన్ పెట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినిమా వాళ్లకు ప్రభుత్వమే ముందుకొచ్చి మరీ సాయం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చాలా కృషి చేసింది. అలాంటిది.. అందరూ కలిసి రావాలన్నా పట్టించుకోరా? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసింది. కక్షసాధింపు చర్యలకు దిగింది. కానీ.. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని సంచలన నిర్ణయం తీసుకున్నారు.






