రాజకీయ చదరంగంలో చిక్కుకున్న ప్రేమ జంట.. ఓటీటీలోకి పొలిటికల్ థ్రిల్లర్

by sudharani |
రాజకీయ చదరంగంలో చిక్కుకున్న ప్రేమ జంట.. ఓటీటీలోకి పొలిటికల్ థ్రిల్లర్
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కంటెంట్‌తో ఉన్న చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీ(OTT)లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఆ సినిమా పేరే ‘పోతుగడ్డ’(Pothugadda). రక్ష వీరమ్ దర్శకత్వం (Director Raksha Veeram) వహించిన ఈ మూవీని శరత్ చంద్ర (Sharat Chandra), అనుపమ చంద్ర (Anupama Chandra) నిర్మించారు. పృథ్వీ (Prudhvi), విస్మయ శ్రీ (Vismaya Sree), శత్రు, ఆడుకాలం నరేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పోతుగడ్డ’ నుంచి ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా మంచి స్పందన లభించింది.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ (ETV Win)లో ఈ నెట 30 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కిట్టూ, గీతూ ఇద్దరు ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి వీళ్లు పారిపోదాం అనుకుంటారు. ఈ క్రమంలోనే రాత్రివేళ ఆ ఊరు నుంచి బస్సులో బయలుదేరుతారు. అయితే.. వాళ్లను ఓ గ్యాంగ్ వెంటాడుతూ ఉంటుంది. మరో వైపు ఓ రాజకీయానికి సంబంధించిన ముఠా అదే బస్సులో రూ.50 కోట్లను అక్రమంగా తరలిస్తుంటారు. దీంతో ఓ వైపు రాజకీయనాయకుడు, మరో వైపు పోలీసులు ఆ బస్సును చేజ్ చేస్తారు. దీని నుంచి ఆ జంట ఎలా బయటపడతారు అనేది కథ.

Advertisement
Next Story