మర్యాదగా ఆ వీడియోలు తొలగించండి, లేదంటే.. స్టార్ డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

మర్యాదగా ఆ వీడియోలు తొలగించండి, లేదంటే.. స్టార్ డైరెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగు సినీ రచయిత, దర్శకుడు కూడా. ‘పటాస్’(Patas), ‘సుప్రీమ్’(Supreme), ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘సరిలేరు నీకెవ్వరు’(Sarileru Neekevvaru), ‘భగవంత్ కేసరి’(Bhagavanth Kesari), ‘ఎఫ్-2’(F-2), ‘ఎఫ్-3’(F-3) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాలే సాధించాయి. రీసెంట్‌గా వెంకటేశ్(Venkatesh) హీరోగా ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ తనపై వచ్చే యూట్యూబ్ వీడియోస్ పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా పై కొందరు ఇష్టం వచ్చినట్లు యూట్యూబ్లో వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన మా బంధువులు, ఆత్మీయులు వాటిని నా భార్యకు పంపి అనిల్ పై ఇలాంటి కథలు రాస్తున్నారేంటని అడుగుతున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశా. కాబట్టి మర్యాదగా వీడియోలు తొలగించండి. ఇకపై నాపై ఇలాంటి వీడియోలు చేయొద్దు. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు. క్లిక్స్ కోసం నచ్చిన కథలు అల్లి చాలా మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటి వల్ల ఎంతో మంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లేని వార్తలు రాయొద్దు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story