- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannappa : కన్నప్ప హార్డ్ డిస్క్ కోసం పోలీసుల వెతుకులాట షురూ
కన్నప్ప సినిమా(Knnappa Movie)కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కన్నప్ప సినిమా(Knnappa Movie)కు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్(24 Frames Factory Pvt Ltd) నిర్మాత రెడ్డి విజయ్ కుమార్, మూడు నెలల క్రితం(మార్చి 23, 2025న) సినిమా యొక్క ముఖ్యమైన VFX డేటా ఉన్న హార్డ్ డిస్క్ మాయమైందని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్(Film Nagar PS)లో ఫిర్యాదు చేశారు. ముంబైలోని హైవ్ స్టూడియోస్( Hive Studios) అనే VFX కంపెనీ నుంచి ఈ హార్డ్ డిస్క్‌ను డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న 24 ఫ్రేమ్స్ సంస్థకు పంపారు. అది ఆఫీస్ బాయ్ రఘుకు డెలివరీ అయినట్లు విచారణలో తెలిసింది. రఘు ఈ హార్డ్ డిస్క్‌ను చరిత అనే మహిళకు ఇచ్చాడని, ఆ తర్వాత ఇద్దరూ పరారయ్యారని నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ హార్డ్ డిస్క్‌లో 90 నిమిషాల కీలక సన్నివేశాలు, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని, ఇది లీక్ అయితే సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మాణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిల్మ్ నగర్ పోలీసులు రఘు, చరితలపై కేసు నమోదు చేసి, వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుండగా.. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల హార్డ్ డిస్క్ మాయం అవడం పెద్ద దెబ్బగా మారనుందని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది.






