‘పోలీస్ కంప్లైంట్’.. హైడ్ అండ్ సీక్ డ్రామా

by Sujitha Rachapalli |

హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుండగా.. డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించారు.

‘పోలీస్ కంప్లైంట్’.. హైడ్ అండ్ సీక్ డ్రామా
X

దిశ, సినిమా : హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుండగా.. డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించారు. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి రచన–దర్శకత్వంలో బాలకృష్ణ మహారాణా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ తెలుగు, కన్నడ టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్..‘ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో భయంతో పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. 45 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి వరలక్ష్మి కారణం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం.. నాలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.

Next Story