- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరలక్ష్మీ శరత్ కుమార్ ‘పోలీస్ కంప్లెయింట్’
వరలక్షీ శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

దిశ, సినిమా : వరలక్షీ శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదల కానున్న చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్ ఉండబోతుందని.. ఈ చిత్రానికే హైలెట్ కానుందని చెప్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్.. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా నడుస్తుందని.. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నట్లు చెప్పారు. చిత్రయూనిట్ అందరి సపోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశామని.. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.






