- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unni Mukundan: స్టార్ హీరోపై పోలీస్ కేసు .. చర్చనీయాంశంగా మారిన ట్వీట్.. సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తానంటూ నిర్మాత సీరియస్ వార్నింగ్
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) అందరికీ సుపరిచితమే. ఆయన ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగానూ రాణిస్తున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్(Unni Mukundan) అందరికీ సుపరిచితమే. ఆయన ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగానూ రాణిస్తున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో నటించిన ఉన్నిముకుందన్‌ను ఫుల్ పాపులారిటీ దక్కింది. ఇక గత ఏడాది ఈ ఆయన ‘మార్కో’(Marco) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హనీఫ్ అదేని(Hanif Adeni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయగా.. భాగానే కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఉన్ని ముకుందన్‌పై పోలీస్ కేసు నమోదు అయినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆయన తన పర్సనల్ మేనేజర్‌గా పని చేసిన విపిన్ కుమార్(Vipin Kumar)ను చితకబాదడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా వేరే హీరోను పొగుడుతూ పోస్ట్ పెట్టడంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన కోపంతో ఊగిపోతూ దాడి చేసినట్లు టాక్. అయితే కొద్ది రోజుల క్రితం పలు కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించాడట. అయినప్పటికీ దాడి చేయడంతో పోలీస్ కేసు పెట్టాడు. ఇక ఫిర్యాదులో ఏముందంటే.. నటుడి అనుచరులు నా ఫ్లాట్ వద్దకు వచ్చి నన్ను పార్కింగ్ ఏరియాకు పిలిపించి దాడి చేశారు.
వారు నా ఇంటి అద్దాలను కూడా పగలకొట్టారు. నేను కూడా ఓ చిత్ర నిర్మాతను అని మర్చిపోయి ఉన్ని ముకుందన్ నాపై దాడి చేయించాడు. అతని కొత్త సినిమా నరివెట్ట గురించి నేను మాట్లాడినందుకు నాపై దాడి జరిగింది. అతను గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెబుతానంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక అది చూసిన ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు. అయితే దీనిపై ఉన్నిముకుందన్ స్పందించకపోవడంతో అంతా కంగారు పడిపోతున్నారు.






