దయచేసి ట్రోలింగ్ ఆపండి.. మీరంతా పత్తిత్తులు ఏం కారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-10 12:50:06  IST  )

గత కొద్ది రోజుల నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

దయచేసి ట్రోలింగ్ ఆపండి.. మీరంతా పత్తిత్తులు ఏం కారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ (వీడియో)
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పచ్చళ్ల బిజినెస్ చేస్తున్న ఓ ముగ్గురు అమ్మాయిలు అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీలుగా మారిపోయారనడంలో అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఓ నెటిజన్ రేట్లు అడిగిన పాపానికి అలేఖ్య అనే అమ్మాయి దారుణంగా తిట్టడంతో వివాదం మొదలైంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం చేస్తూ ట్రోల్స్ చేయడంతో ఆమె క్షమాపణలు కోరింది. అయినప్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాను షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఇష్యూను హీరో ప్రియదర్శి తన మూవీ ప్రమోషన్స్‌కు కూడా ఉపయోగించుకున్నాడు. అలాగే నెటిజన్లు కూడా పలు వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా, ఈ ఇష్యూపై బిగ్‌బాస్ బ్యూటీ గీతూ రాయల్(Geethu Royal) స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘కోపం వచ్చినప్పుడు మగవాళ్ళే కాదు ఆడవాళ్లు కూడా బూతులు మాట్లాడవచ్చు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాం.. ఎప్పుడు మాట్లాడుతున్నామా అసలు మనం అనే మాటలకు అర్థం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పటికే మీ అందరికీ అర్ధం అయిపోయి ఉంటది.. నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది. అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles) వాళ్లు వాల్ల కష్టమర్‌ను ఏదో ప్రశ్న అడిగాడని అమ్మానా బూతులు తిట్టినట్లు ఓ ఆడియో బయటకు రావడంతో భయంకరంగా వైరల్ అయిపోయింది. దీంతో చాలా కాంట్రవర్సీలు, ట్రోల్స్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

ఇక ఆ ముగ్గురు మాత్రం క్షమాపణలు కోరారు. అయితే తప్పు అనేది అందరూ చేస్తారు. కాబట్టి ట్రోల్స్ చేసే వారంతా పత్తిత్తులు కాదు.. వారంతా పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారకుండా ఏం ఉండదు. కాబట్టి అలేఖ్య వాళ్లు సారీ చెప్పిన తర్వాల వాల్లను వదిలేయాలి కానీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే చనిపోయిన వాల్ల నాన్నను కూడా మధ్యలోకి తీసుకువస్తున్నారు. అలా చేయడం తప్పు వాళ్లు అందరి కాళ్లు పట్టుకుని అడుక్కోవాలా ఏంటి నాకు అర్థం కావట్లే. అలా చేయడానికి అంత పెద్ద తప్పు అయితే వాళ్లు చేయలేదు. కస్టమర్‌ను అలా అనడం తప్పే.. అయితే అలేఖ్య ట్రోల్స్ వల్ల హస్పిటల్‌లో ఉంది. కాబట్టి ఇంకా ట్రోల్స్ చేయకండి. దయచేసి ఇవన్నీ ఆపేయండి. బతికున్న వారిని చనిపోయేవరకు తీసుకెళ్లకండి.

Next Story