దయచేసి కూర్చోరా..?.. ఓకే ఐ లవ్ యూ.. పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన రష్మిక!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-16 04:40:58  IST  )

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కొలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర'.

దయచేసి కూర్చోరా..?.. ఓకే ఐ లవ్ యూ.. పబ్లిక్‌గా ప్రపోజ్ చేసిన రష్మిక!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున (Nagarjuna), కొలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) కాంబోలో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' (Kubera). డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా (Rashmika mandanna) నటిస్తున్నారు. ధనిక-పేద, డబ్బు బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హైదారబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లోనే కుబేర ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పై రష్మిక సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రష్మిక స్టేజ్ ఎక్కిన క్షణం నుంచి ఫ్యాన్స్ గోలలు చేస్తూ, డ్యాన్స్‌లు వేయటం చేశారు. అది చూసి రష్మిక.. 'ఏంట్రా ఇలా డ్యాన్స్ చేస్తున్నావ్ అని వారించారు. అలాగే, ఆగండ్రా.. మాట్లాడనివ్వండ్రా.. మర్చిపోతున్నాను రా.. దయచేసి కూర్చోండి రా.. ఐ లవ్ యూ' అంటూ తన ఫ్యాన్స్‌ని స్వీట్‌గా, క్యూట్‌గా వార్న్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక రష్మిక మందన్నా ప్రస్తుతం తమ్మ, ది గర్ల్‌ఫ్రెండ్‌, కాక్‌టేల్-2 చిత్రాల్లో కూడా నటిస్తోన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story