దయచేసి మా కాంబోను సెట్ చేయండి.. ఐకాన్ స్టార్‌పై కన్నేసిన కృతి సనన్

by Mallepaka Hamsa |

ఒక నటుడిగా నాకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అద్భుతంగా ఉంటాయి. నిజంగానే ఆయన చాలా గొప్ప నటుడు.

దయచేసి మా కాంబోను సెట్ చేయండి.. ఐకాన్ స్టార్‌పై కన్నేసిన కృతి సనన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి సనన్ ఫుల్ ఫామ్‌లో ఉంది. గత ఏడాది ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, అదే జోరుతో ఇప్పుడు తన క్రేజీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘కాక్‌టైల్-2’తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన ‘కాక్‌టైల్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీలో కృతి సనన్‌తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 19న భారీ స్థాయిలో విడుదల కాబోతుండగా.. కృతి సనన్ అప్పుడే సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా కృతి సనన్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. "ఒక నటుడిగా నాకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం.

ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అద్భుతంగా ఉంటాయి. నిజంగానే ఆయన చాలా గొప్ప నటుడు. బన్నీతో కలిసి ఒక సినిమా చేయాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. రండి మిత్రులారా, మీరందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అయినా సరే దయచేసి మా కాంబోలో సినిమా నిజమయ్యేలా చేయండి" అంటూ కృతి ఐకాన్ స్టార్ అభిమానులను రిక్వెస్ట్ చేయడం గమనార్హం. కృతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. నిజానికి కృతి సనన్ కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ తోనే. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘దోచేయ్’ లో నాగచైతన్య సరసన నటించగా.. ‘మిస్టర్ మజ్ను’ లో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే పాన్-ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు వచ్చింది కానీ, తెలుగులో ఆమెకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు.

Next Story