దయచేసి వెంటనే సహాయం అందించండి.. నా కుటుంబంతో ఖాట్మండులో ఇరుక్కుపోయానంటూ నిర్మాత ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-25 14:33:12  IST  )

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) నిత్యం పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.

దయచేసి వెంటనే సహాయం అందించండి.. నా కుటుంబంతో ఖాట్మండులో ఇరుక్కుపోయానంటూ నిర్మాత ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) నిత్యం పలు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 2011లో నిర్మాణ రంగంలోకి వచ్చిన ఆయన ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పని చేశారు. ఇక ఇటీవల బన్నీ వాసు సింగిల్(Single), తండేల్(Tandel) వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని లాభాలు పొందారు. ఆయన ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంటారు. తాజాగా, బన్నీ వాసు ఫ్యామిలీతో కలిసి నేపాల్ రాజధాని ఖాట్మండుకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇబ్బందుల్లో పడిన ఆయన సాయం కోరుతూ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘హలో ఎయిరిండియా... నేను బన్నీ వాస్ (ఉదయ శ్రీనివాసు). నేను ఈరోజు AI 0218 ఫ్లైట్ (PNR నంబర్: POLG9Y) ద్వారా ఖాట్మండు నుంచి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉంది. అయితే మీరు ఆ ఫ్లైట్‌ను రద్దు చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయని నేను అర్ధం చేసుకోగలను. నేను బిజినెస్ క్లాస్ ప్రయాణీకుడినే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో పేరొందిన నిర్మాతని కూడా. ఖాట్మండులో అనీష్ అనే మీ సిబ్బందిని సంప్రదించే క్రమంలో ఓ కౌంటర్ నుంచి మరో కౌంటర్‌కి తిరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదు.

రాత్రి 9 గంటల ఫ్లైట్ గురించి నాకు స్పష్టమైన సమాచారం కావాలని అడుగుతున్నా మీ నుంచి సరైన స్పందన రావడం లేదు. నా కుటుంబం, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నందున దయచేసి వెంటనే సహాయం అందించాలని కోరుతున్నా’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎయిరిండియా.. సమస్యను పరిష్కరించడానికి కాస్త సమయాన్ని కోరుతూ వ్యక్తి ప్రయాణ వివరాలు ఎవరితో పంచుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ రిప్లై ఇచ్చారు.

Click For Tweet..

Next Story