ప్లీజ్.. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. రామ్ చరణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadri Express) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్లీజ్.. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.. రామ్ చరణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadri Express) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకుల్లో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ భామకు తిరుగు లేదు అని అనుకుంటున్న టైంలో మొత్తం రివర్స్ అయింది. ఏమైందో ఏమో కానీ తెలుగులో సినిమా ఆఫర్లు రావడమే మానేశాయి. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నానీ(Jackey Bhagnani)తో ప్రేమలో పడి షికార్లు చేసింది.

అంతేకాకుండా గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం తన భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ పై కన్నేసింది. రీసెంట్‌గా అక్కడ ఓ సినిమాను అనౌన్స్ చేసింది. అయితే ఆ చిత్రం కూడా ఫిబ్రవరి చివర్లో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అలా ఓ పక్క సినిమాలు మరొపక్క భర్తతో లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన మ్యారేజ్ టైంలో ఇచ్చిన డ్యాన్స్ పర్ఫామెన్స్ పై వచ్చిన ట్రోల్స్, ఫాల్స్ న్యూస్ పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “జనాలు ఎందుకు ఈ విషయాన్ని వదలడం లేదో నాకు అర్థం కావడం లేదు. ముందు నేను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఒకటికి మూడింతలు రెమ్యునరేషన్ తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చేశారు. నాకు చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఈ రూమర్స్‌తో మా నాన్న చాలా బాధపడుతున్నారు.

ఒక్కరు కూడా నిజ నిజాలు పరిశీలించడం లేదు కదా, కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను. మీకు నా గురించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. కానీ ఇలాంటి మాటలు మాత్రం పుట్టించొద్దు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై ఆమె ఫ్యాన్స్ మీరు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు, మీరెంటో మాకు తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story