రష్మిక సినిమాపై పైరసీ ఎఫెక్ట్.. రిలీజ్‌కు ముందే దాదాపు వంద కోట్ల నష్టం..

by Sujitha Rachapalli |

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సికందర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా

రష్మిక సినిమాపై పైరసీ ఎఫెక్ట్.. రిలీజ్‌కు ముందే దాదాపు వంద కోట్ల నష్టం..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సికందర్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా డల్‌గానే ఉండటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఇందుకు కారణం పైరసీ భూతమని అంటున్నారు మేకర్స్. రిలీజ్‌కు ముందే సినిమా లీక్ కావడంతో దాదాపు వంద కోట్లు నష్టపోయామని చెప్తున్నారు. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నడియాడ్వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. ఇక ఈ చిత్రం మార్చి 31న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.

Next Story