Amaran: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ వాడారని కోటి డిమాండ్.. కీలక నిర్ణయం తీసుకున్న చిత్రబృందం

by Kodari Anjali |

నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘అమరన్’ సినిమాను రూపొందించారు రాజ్ కుమార్ పెరియసామి.

Amaran: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ వాడారని కోటి డిమాండ్.. కీలక నిర్ణయం తీసుకున్న చిత్రబృందం
X

దిశ, వెబ్‌డెస్క్: నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘అమరన్’ (Amaran)సినిమాను రూపొందించారు రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periasamy). బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో సాయిపల్లవి(Sai Pallavi) ఇందు రెబెకా(indhu Rebekah) పాత్రలో.. నటుడు శివ కార్తికేయన్(Siva Karthikeyan).. ముకుంద్ వరదరాజన్‌(Mukund Varadarajan)గా నటించి.. ప్రేక్షకులకు కంటతడి పెట్టించారు. కమల్‌హాసన్(Kamal Haasan) నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఏకంగా 300 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది. ప్రజెంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే అమరన్ చిత్రంలో ఒక చిట్టీలో హీరోయిన్‌.. హీరోకు తన ఫోన్ నంబర్ రాసి ఇచ్చే సన్నివేశం ఉంటుంది.

కాగా ఆ నంబర్ ఒక విద్యార్థి మొబైల్ నంబర్. సినిమా విడుదలయ్యాక.. తన ఫోన్ కు చాలా కాల్స్ వస్తున్నాయంటూ విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. కాగా తాజాగా మూవీ టీమ్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గొడవకు కారణమైన సినిమాలో చూపించిన ఫోన్ నంబరును బ్లర్ చేశారు. అలాగే ప్రస్తుతం ఓటీటీలో వస్తోన్న మూవీలోని, యూట్యూబ్‌లో ఈ పాటలో కనిపిస్తోన్నది కంప్లీట్‌గా ఈ విద్యార్థి ఫోన్ నంబర్ బ్లర్ చేశారు. చెన్నైకు చెందిన విఘ్నేశన్(Vigneshan) ఇంజినీరింగ్ విద్యార్థి.. అమరన్ సినిమాలో తన నంబర్ వాడడం వల్ల దాదాపు 4 వేల ఫోన్ కాల్స్ వచ్చాయని ముందుగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ.. లీగల్ నోటీసులు పంపించాడు. కానీ చిత్ర బృందం స్పందించకపోవడంతో మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో దావా వేశాడు. తాజాగా మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story