- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పేట రౌడీ’ బర్త్ డే.. ఫొటో వైరల్
by Sujitha Rachapalli |
వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.

X
దిశ, సినిమా : వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి కర్తనాధ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మాస్ లవ్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను ఆనంద్ గ్రూప్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎల్. ఆనంద్ కుమార్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయిందని, త్వరలోనే మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Next Story






