- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైన్యంలోని వ్యక్తులే నిజమైన హీరోలు.. బాలీవుడ్ నటులు-క్రికెటర్లు కాదు.. ఈ కోట్‌కు అనుష్క శర్మ లైక్ కొట్టడంతో..?
బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. ఈ నటి అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ బ్యూటీకి కోట్లలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక సినిమాల్లో నటించే క్రమంలోనే అనుష్క శర్మ.. ప్రముఖ భారత క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది. ఇక వీరిద్దరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. వివాహనంతరం నటి అనుష్క శర్మ సినిమాలకు గుడ్ బై చెప్పింది. భర్తకు మద్ధతుగా నిలుస్తూ.. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉత్తమ భార్యగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది. ఇకపోతే ఈమె తాజాగా ఒక రెడ్డిట్ యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనుష్క శర్మ లైక్ చేసిన పోస్ట్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సైన్యంలోని వ్యక్తులే నిజమైన హీరోలు, బాలీవుడ్ నటులు లేదా క్రికెటర్లు కాదు.. అనే కోట్ రాసి ఉంది. దీనికి అనుష్క లైక్ కొట్టడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఒకప్పుడు అనుష్క శర్మ నాన్న ఆర్మీలో చేశారుగా అందుకు ఈ పోస్టుకు లైక్ కొట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా పాకిస్థాన్-ఇండియా మధ్య జరిగిన యుద్ధం క్రమంలో కూడా అనుష్క సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈమె నాన్న అజయ్ కుమార్ కార్గిల్ యుద్ధం సమయలో తాను అనుభవించిన భయం గురించి రాసుకొచ్చింది. ఆ సమయంలో తను చిన్న పిల్ల అని.. యుద్ధం సమయంలో ప్రాణనష్టాన్ని ప్రకటించినప్పుడల్లా .. తన అమ్మ ఎంత కలత చెందింతో వెల్లడించిన విషయం తెలిసిందే.






