Pushpa 2 Song : ‘పుష్ప- 2 నుంచి పీలింగ్స్ పూర్తి పాట విడుదల.. ఆకట్టుకుంటోన్న శ్రీవల్లీ-పుష్పరాజ్ స్టెప్పులు!

by Kodari Anjali |   (  Updated:2025-08-03 09:43:30  IST  )

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 విడుదల నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

Pushpa 2 Song : ‘పుష్ప- 2 నుంచి పీలింగ్స్ పూర్తి పాట విడుదల.. ఆకట్టుకుంటోన్న శ్రీవల్లీ-పుష్పరాజ్ స్టెప్పులు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Famous director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 (Pushpa-2) విడుదల నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే పీలింగ్స్ సాంగ్ ప్రోమో(Peelings Song Promo) రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా ఫుల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ప్రోమో మలయాళం(Malayalam)లో ఉంది. పల్లవి లిరిక్స్(Pallavi Lyrics) కూడా మలయాళంలోనే ఉన్నాయి. తర్వాత నుంచి తెలుగులో పాట కొనసాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్(Devishri Prasad) మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌కు చంద్రబోస్(Chandra Bose) లిరిక్స్ అందించారు. అలాగే లక్ష్మీ దాసు(Lakshmi dasu) , శంకర్ బాబు కందుకూరి(Shankar Babu Kandukuri) ఆలపించారు. సాంగ్ ప్రోమోకే భారీగా రెస్పాన్స్ లభించింది. ఇటీవల విడుదలైన శ్రీలీల(sreeleela) స్టెప్పులేసిన ఐటెమ్ సాంగ్‌(Item Song)కు ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రజెంజ్ వచ్చిన పీలింగ్స్ సాంగ్‌తో పుష్ప-2 పై నెటిజన్లలో మరింత హైప్ పెంచుతుంది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) అండ్ రష్మిక(Rashmika) వేసిన అదిరిపోయే స్టెప్పులను మీరు కూడా ఓ లుక్కేయండి. ఇక పుష్ప-2 లో ఫాహద్ ఫాజిల్(Fahad Fazil), సునీల్(Sunil), అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj), జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేశ్(Rao Ramesh) ముఖ్య పాత్రల్లో నటించారు.

Video Link..

Pushpa 2: పుష్ప 2 టీజర్ అచ్చం దింపేసిన బుడ్డోడు.. మరీ ఇంత టాలెంటెడ్ ఉన్నావేంట్రా అంటూ..!!

Next Story