Peddi : ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ప్రీమియర్స్ ఆ తేదీనే

by Pulgam srinivas |

Peddi : ఈ చిత్ర నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకుంది. నార్త్ అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్లను ఏప్రిల్ 29న ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు.

Peddi : ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ప్రీమియర్స్ ఆ తేదీనే
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో పెద్ది యూనిట్ ప్రమోషన్ల స్పీడును పెంచేశారు. కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు.

దానికి మంచి రెస్పాన్స్ లభించింది. మార్చి 2వ తేదీన రెండవ పాటను వదలనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్కో ఏరియా థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా నార్త్ అమెరికా హక్కులను అమ్మేశారు. ఈ చిత్ర నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ దక్కించుకుంది. నార్త్ అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్లను ఏప్రిల్ 29న ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. పెద్దిలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.

జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యాంధు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పవర్ఫుల్ ఎంటర్టైనర్ మీద ఇండియావ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.


Next Story