‘పెద్ది’ విడుదలపై టెన్షన్.. చిరంజీవితో ఎగ్జిబిటర్ల కీలక భేటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-25 11:24:57  IST  )

రామ్ చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కించిన పెద్ది సినిమా మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమైంది.

‘పెద్ది’ విడుదలపై టెన్షన్.. చిరంజీవితో ఎగ్జిబిటర్ల కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ హీరోగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తెరకెక్కించిన పెద్ది సినిమా మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను చిత్రబృందం వేగవంతం చేయగా.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తెలంగాణ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇకపై సినిమాల విడుదలల్లో తమకు పర్సంటేజిని ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పెద్ది సినిమా నుంచే దానిని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాలేవీ లేవని, పెద్ది నుంచి పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తే.. తాము కూడా నష్టపోకుండా ఉంటామని ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. పర్సంటేజి ఇవ్వకుంటే పెద్ది సినిమా విడుదల కానివ్వమని ఇటీవలే ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్ల బృందం సమావేశమయింది. పర్సంటేజి విధానంలోనే పెద్ది సినిమాను విడుదల చేయాలని చిరంజీవితో చర్చిస్తున్నారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లు, రెంటల్ విధానంలో తాము చూస్తున్న నష్టాలను గురించి కూడా అసోసియేషన్ చిరంజీవికి వివరించనుంది. ఈ సమావేశానికి ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. సమావేశం తర్వాత చిరంజీవి ఏ నిర్ణయం తీసుకుంటారో, పెద్ది విడుదలకు ఎగ్జిబిటర్లు గ్రీన్ సిగ్నలిస్తారో లేదో చూడాలి.

Next Story