- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది మానియా.. ప్రేమకు చిహ్నంగా దానిని గిఫ్ట్‌గా ఇచ్చిన యూకే ఫ్యాన్స్.. ఫొటోస్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(Peddi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(Peddi) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లండన్(Landon)లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని స్వయంగా చరణ్ తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. అయితే లండన్‌ను కూడా పెద్ది మానియా ఆక్రమించింది. గ్లోబల్ స్టార్ అభిమానులు యూకే(UK) నుండి వచ్చిన ఉత్సాహభరితమైన పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ పై ప్రేమకు చిహ్నంగా సినిమా టైటిల్ ఉన్న కస్టమ్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే వారు చరణ్‌కు ఈ సినిమా గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నామని తెలిపారు.. కాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందులో రామ్ చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి బంతిని కొట్టె షాట్ అయితే ఇంకా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.






