- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ.. వేదిక ఖరారు?
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించేందుకు మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ ఎడిట్ లాక్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మే 16న విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద అనేక కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






