ఆ పాత్రకు నేను సరిపోనని ముందే చెప్పా.. డిజాస్టర్ మూవీపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ఏక్ దిన్ సినిమాలో తన పాత్ర సరిగ్గా చేయలేదని సాయి పల్లవి ముందే చెప్పిందట.

ఆ పాత్రకు నేను సరిపోనని ముందే చెప్పా.. డిజాస్టర్ మూవీపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచులర్ బ్యూటీ సాయి పల్లవి రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమిర్ ఖాన్ తనయుడు జువైద్ హీరోగా నటించిన ‘ఏక్ దిన్’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం డిజాస్టర్ అందుకోవడంతో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే.. ఈ సినిమాలో తన పాత్రకు తగిన న్యాయం చేయలేదని సాయి పల్లవి ముందే చెప్పిందట. అలాగే ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిదో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘ఏక్ దిన్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. స్టోరీ చెప్పగానే ఓకే చెప్పేశాను. అయితే ప్రీమియర్ షో చూసిన తర్వాత ఈ పాత్రకు నేను సరిపోలేదని నాకు అనిపించింది. ఇదే మాట ఆమిర్ ఖాన్‌తో చెప్పా. ‘ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో. చురుగ్గా, హుషారుగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపిక చేసి ఉండాల్సింది. వాళ్లు ఈ పాత్రకు బాగా న్యాయం చేసేవాళ్లు' అని నా మనసులో మాటను ఆమిర్తో చెప్పా’ అన్నారు. సినిమా డిజాస్టర్ కావడంతో సాయి పల్లవి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Next Story