- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi: రామ్ చరణ్ ను వణికిస్తున్న నాని.. ?
సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటాపోటీ నెలకొంటూ ఉంటుంది. ఒకే రోజున బడా హీరోల సినిమాలు రిలీజ్.. అయిన రోజున... ఫ్యాన్స్

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటాపోటీ నెలకొంటూ ఉంటుంది. ఒకే రోజున బడా హీరోల సినిమాలు రిలీజ్.. అయిన రోజున... ఫ్యాన్స్ మధ్య రచ్చ వాతావరణం నెలకొంటుంది. అయితే.. ఒకే రోజున ఇద్దరు హీరోలు... ముగ్గురు హీరోల సినిమాలు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. తాజాగా... మెగా హీరో రామ్ చరణ్ ( Ram Charan) కు పోటీగా వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని ( Nani). నాని ప్రస్తుతం పారడైజ్ ( the paradise ) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా... ఈ మూవీ వచ్చే సమ్మర్ కు రిలీజ్ కానుంది. మార్చి 26వ తేదీన 2026 గురువారం రోజున ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతుంది.
అయితే అదే సమయంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమా ( Peddi) కూడా రిలీజ్ కానుంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో పెద్ది సినిమా వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ( Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే... క్రికెట్ నేపథ్యంలో వస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్... తాజాగా అనౌన్స్ చేశారు. మార్చి 27 శుక్రవారం రోజున 2026 లో పెద్ది సినిమా రిలీజ్ కానుంది. అంటే ప్యారడైజ్ రిలీజ్ అయిన మరుసటి రోజు పెద్ది సినిమా రిలీజ్ కానుంది. వాస్తవానికి నాని సినిమాలు మినిమం గ్యారంటీ హిట్ అవుతాయి.
కానీ రామ్ చరణ్ చేసిన సినిమా హిట్ అయితే కోట్ల వర్షం కురుస్తుంది. మొన్నటి గేమ్ చేంజర్ తరహాలో సినిమా ఫ్లాప్ అయితే.. మెగా ఫ్యాన్స్ నిరాశ పడక తప్పదు. అయితే ఇలాంటి నేపథ్యంలో నాని సినిమా వస్తుందని తెలిసి కూడా.. పెద్ది సినిమాను మార్చి 27వ తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆరోజున రాంచరణ్ బర్త్డే కాబట్టి.. సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ముందడుగు వేసినట్లు సమాచారం. మరి ఈ రెండు సినిమాలలో జనాలు ఏ హీరోను ఆదరిస్తారో చూడాలి.
#TheParadise #PEDDI pic.twitter.com/t8yHMBnvk5
— Gulte (@GulteOfficial) April 6, 2025






