ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. సీక్వెల్‌కు సిద్దమైన పాయల్ రాజ్‌పుత్ సెక్సువల్ డిజార్డర్ మూవీ

by Chukka Sudharani |

‘RX-100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. మొదటి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. సీక్వెల్‌కు సిద్దమైన పాయల్ రాజ్‌పుత్ సెక్సువల్ డిజార్డర్ మూవీ
X

దిశ, సినిమా: ‘RX-100’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). ఈ సినిమాలో నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. మొదటి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా అనంతరం అనుకున్నంత రేంజ్‌లో అవకాశాలు రానప్పటికీ వచ్చిన ప్రతి ఆఫర్ అందుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసింది. వాటితో కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక పాయల్ గ్రాఫ్ పడిపోయింది అనుకునే క్రమంలో ‘మంగళవారం’(Mangalavaram) సినిమాతో ఎంట్రీ ఇచ్చి మళ్లీ క్రేజ్ తెచ్చుకుంది. సెక్సువల్ డిజార్డర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నందిత శ్వేత(Nandita is white), అజయ్ ఘోస్, దివ్యా పిళ్లై కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇక ఈ సినిమాలో పాయల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ‘మంగళవారం’తో మరో హిట్టు తన ఖాతాలో వేసుకుందనే చెప్పాలి. ఇక 2023లో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని దక్కించుకోవడంతో.. ఈ మూవీ సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడట డైరెక్టర్ అజయ్ భూపతి. నెట్టింట వైరల్ అవుతున్న బజ్ ప్రకారం ఇప్పటికే ‘మంగళవారం’ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాలన్నీ త్వరలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈ సీక్వెల్‌లో పాయల్ ప్లేస్‌లో మరో కొత్త హీరోయిన్ నాటించొచ్చని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.

Next Story