ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ షురూ చేసిన పాయల్ రాజ్‌పుత్.. అశ్లీల ఫొటోలు, వీడియోలపై షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

దేశ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను (Instagram Subscription) ప్రారంభించి ఆదాయం పొందుతున్నారు.

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ షురూ చేసిన పాయల్ రాజ్‌పుత్.. అశ్లీల ఫొటోలు, వీడియోలపై షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను (Instagram Subscription) ప్రారంభించి ఆదాయం పొందుతున్నారు. నటి నందిత శ్వేత ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించినప్పుడు, నెటిజన్లు కొందరు ఆమెను ట్రోల్ చేయగా.. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమేనని ఆమె గట్టిగానే సమాధానమిచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో, ఈ ఏడాది పాయల్ రాజ్‌పుత్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ పేజీని ప్రారంభించింది. అయితే, తన సబ్‌స్క్రిప్షన్ పేజీలో ఎలాంటి అశ్లీల లేదా బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేయనని, అలాంటివీ ఆశించి ఎవరైనా వస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చంటూ ఆమె తాజాగా ఒక ఘాటైన పోస్ట్ పెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్లు..

ఢిల్లీలో పుట్టి పెరిగిన పాయల్ రాజ్‌పుత్ 2017లో 'చన్నా మేరేయా' అనే పంజాబీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన 'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హిందీ అనే తేడాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ రాణిస్తోంది. ఈ ఏడాది లెజెండ్ శరవణన్ నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం 'లీడర్'లో స్పైగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లో 4 మిలియన్ల (40 లక్షల) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే పాయల్, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రబ్స్క్రిప్షన్ ఫీచరను ప్రారంభించగా.. ఇప్పటివరకు 96 మంది ఆమెను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నెలకు ఒక్కొక్కరికి రూ.390 చొప్పున ప్రస్తుతం ఆమెకు నెలకు సుమారు రూ. 37,440 ఆదాయం లభిస్తోంది. త్వరలోనే ఈ సబ్స్క్రైబర్ల సంఖ్య వెయ్యి దాటుతుందని అంచనా వేస్తున్నారు.

అలాంటి కంటెంట్ ఉండదు..

సబ్ స్క్రిప్షన్ ప్రారంభించినప్పటి నుండి, కొందరు నెటిజన్లు ఎక్స్ క్లూజివ్‌గా బోల్డ్ లేదా అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి గట్టి కౌంటర్ ఇస్తూ పాయల్ స్పందించింది. "ఎవరైనా అశ్లీల కంటెంట్ ఆశించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవద్దు. అలాంటి వాటికి ఇక్కడ చోటు లేదు. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నా నిజ జీవితాన్ని (Real life) చూడాలనుకునే వారి కోసమే ఈ సబ్స్క్రిప్షన్" అని ఆమె స్పష్టం చేసింది. ఈ ప్రకటన తర్వాత ఆమె సబర్ల సంఖ్య పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

Next Story