హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ సిస్టర్ అంటూ ఆమెకు విష్ చేసిన పవన్ భార్య.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

సీరియల్ నటి అంజలి(Anjali) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ సిస్టర్ అంటూ ఆమెకు విష్ చేసిన పవన్ భార్య.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి అంజలి(Anjali) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘మొగలిరేకులు’(Mogali Rekulu), ‘దేవత’(Devatha) వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలానే యాంకర్‌గా పలు టీవీ షోలు కూడా చేసింది. ఇక నటుడు అయినటువంటి పవన్‌(Pawan)ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. అయితే వీరికి ఇప్పటికే చందమామ(ధన్విక) అనే పాప ఉండగా.. ఇటీవలే తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు అంజలి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అంజలి తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్(Priyanka Jain) ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే క్యూటీ అండ్ సిస్టర్.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.




Next Story