- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ వ్యక్తిత్వం అలాంటిది.. అసలు విషయం చెప్పేసిన పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... బద్రి సినిమా కథ విన్నాక పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ మార్చమన్నారు. కానీ నేను మార్చను అన్నాను. అది నచ్చడంతోనే ఆయన నాకు సినిమా అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన కొంతకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా పవన్‌తో మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ అప్పటికే స్టార్ హీరోగా ఉన్నారు. ఆయనతో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. అందులో భాగంగా ఆయన మేనేజర్‌ను ప్రతిరోజూ కలిసేవాడిని. ఆయన స్టోరీ చెప్పే అవకాశం కల్పిస్తానని అన్నారు.
ఆ తర్వాత చోటా కె. నాయుడు గారిని కలిసి, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే విధంగా నా దగ్గర ఒక కథ ఉందని చెప్పాను. ఇక ఆయనకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను వివరించాను. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో పవన్ గారిని కల్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ మేనేజర్ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు కథ వింటారు, మీరు రేపు ఉదయం నాలుగు గంటలకు రండి అన్నారు. నేను మరుసటి రోజు ఉదయం మూడు గంటలకు లేచి వెళ్లాను. అప్పుడే పవన్ కళ్యాణ్, "నేను నీకు కేవలం అర్ధగంట మాత్రమే ఇస్తాను, కథ చెప్పు" అన్నారు. దానికి నేను "నాకు అర్ధగంట సరిపోదు సార్" అన్నాను.
"మరి ఎలా?" అని నన్ను అడిగాడు. అప్పుడు నేను "నేను కథ చెబుతూ వెళ్తాను, మీకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు డోర్ తీయండి, నేను వెళ్ళిపోతాను" అన్నాను. ఆ తర్వాత బద్రి సినిమా కథ చెప్పడం మొదలు పెట్టాను, అలా నాలుగు గంటల పాటు ఆయన కథ విన్నారు. చివరగా సినిమా స్టోరీ బాగుంది, క్లైమాక్స్ మారిస్తే చేస్తాను అన్నారు. కానీ నాకు అదే క్లైమాక్స్‌తో చేయాలని అనిపించింది. అదే విషయాన్ని ఆయనకు చెప్పాను. అప్పుడు పవన్ కళ్యాణ్, "నువ్వు గనుక క్లైమాక్స్ మారిస్తే నీకు సినిమా అవకాశం ఇచ్చేవాడిని కాదు. నువ్వు నీలాగా ఉన్నావు కాబట్టి నీకు సినిమా అవకాశం ఇస్తాను" అని చెప్పారని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.






