రాజకీయాల్లోకి రావ‌డంపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..అస‌లు రాక‌పోయేవాడిని !

by velandi.Saikiran |

రాజకీయాల‌కు రావ‌డంపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుజిత్ ఉండి ఉంటే...అస‌లు రాక‌పోయేవాడిని అన్నారు ప‌వ‌న్‌.

రాజకీయాల్లోకి రావ‌డంపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..అస‌లు రాక‌పోయేవాడిని !
X

దిశ‌, వెబ్ డెస్క్ : రాజకీయాల్లోకి రావడం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సుజిత్ లాంటివాళ్ళు అప్పట్లో ఉండి ఉంటే తాను రాజకీయాల్లోకి రాబోయే వాన్ని.. కాదంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఇవాళ OG సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తితో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. ఊర మాస్ లుక్ లో మెరిసారు పవన్ కళ్యాణ్.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తాను సినిమా ప్రేమికుడిని అని వ్యాఖ్యానించారు. సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప తనకు ఎలాంటి ఆలోచన ఉండబోదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కూడా తన ప్రవర్తన అలాగే ఉంటుందని తెలిపారు. నాకు జపనీస్ రాదని.. దర్శకుడు సుజిత్ పట్టుబట్టి మరి తనకు.. జపనీస్ నేర్పించారని వెల్లడించారు. అతని దర్శకత్వంలో టీం అద్భుతంగా పనిచేస్తుంది అని గుర్తు చేశారు. ఇలాంటి టీం నేను దర్శకత్వం చేసే సమయంలో ఉండి ఉంటే... రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అంటూ... పవన్ కళ్యాణ్ వాపోయారు.

Next Story