పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ భార్య.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by I. Sairam |   (  Updated:2025-06-15 11:36:17  IST  )

యాంకర్‌గా, సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైన అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ భార్య.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా, సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైన అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘మొగలిరేకులు’(Mogali Rekulu) సీరియల్ ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం తన భర్త పవన్‌(Pawan), కూతురు ధన్విక (చందమామ)తో కలిసి అంజలి యూట్యూబ్ చానల్ రన్ చేస్తుంది. దీంట్లో వీళ్ల వీడియోలకి మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక సోషల్ మీడియా(Social Media)లో కూడా అంజలి-పవన్ జోడిగా మంచి క్రేజ్ ఉంది.

అయితే రీసెంట్‌గా అంజలి తన ఫ్యాన్స్‌కి తాను రెండోసారి తల్లి కాబోతున్నా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిన్నది పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ.. ‘ఫుల్ వీడియో కమింగ్ సూన్ వి చందమామ’ అనే క్యాప్షన్ జోడించింది. అయితే పాపనో, బాబునో రివీల్ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

anjaliattota post

Next Story