మోహన్ రాజా దర్శకత్వంలో పవన్?

by Pulgam srinivas |

'పవన్ కళ్యాణ్'తో సినిమా చేయడానికి మోహన్ రాజా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో పవన్?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం క్రితమే ఎన్నికలు జరిగాయి. పవన్ వాటికి ముందు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలకి కమిట్ అయ్యాడు. వీటి తర్వాత ఈయన సినిమాలు చేయడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు విడుదలయ్యాయి.

రేపు ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది. పవన్ మాత్రం ఈ చిత్రాలతో ఆపకుండా వేరే వాటికి కూడా కమిట్ అవుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. తాజాగా మరో దర్శకుడి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 'హనుమాన్ జంక్షన్'తో హిట్ కొట్టి ఆ తర్వాత తమిళ సినిమాలను రూపొందించి మంచి పేరు తెచ్చుకున్న మోహన్ రాజా దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మోహన్ రాజా ఆఖరుగా చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మలయాళ మూవీ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రం విడుదలయ్యాక ఈ దర్శకుడు 'తని ఒరువన్ 2' చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ తో సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story