- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ పరిణామం.. జనాల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న పవన్ భార్య
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. భోజ్ పురి స్టార్, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. భోజ్ పురి స్టార్, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కరాకట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నానని ప్రకటించిన ఆమె.. ఈ సమయంలో జనం తనకు మద్దతివ్వాలని కోరింది.
'రాముడు, కృష్ణుడి వంటి అవతారమూర్తులు కూడా చాలా భరించాల్సి వచ్చింది. నేనొక అల్పమైన మహిళను. వివిధ కుట్రలను ఎదుర్కొన్నా. కొందరు నన్ను నిందించారు. ఆప్యాయత, ఆశీర్వాదాల కోసం ఆరాటపడ్డా. కన్నీరు పెట్టుకున్నా.. విలపించా. నాలాంటి లక్షలాది మంది బాధితుల గొంతును శక్తివంతం చేసేందుకు కరాకట్ నుంచి పోటీ చేయబోతున్నా’ అని తెలిపింది. అలాగే యూపీఐ, స్కానర్, బ్యాంక్ డిటెయిల్స్ షేర్ చేసిన ఆమె.. తనకు ఆర్థికంగా సపోర్ట్ అందించాలని కోరింది. కాగా పవన్ సింగ్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ దూరం పెట్టాడు. జ్యోతి సింగ్ ప్రయత్నించినా కలవకపోవడం, స్పందించకపోవడంతో మరింత దూరం పెరిగింది.






