- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత్తర లేపిన 'ఉస్తాద్'.. పూనకాలు తెప్పిస్తున్న ట్రైలర్
మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఈరోజు (శనివారం) విడుదల చేసింది. "ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ మరియు వింటేజ్ లుక్స్ చూస్తుంటే 'గబ్బర్ సింగ్' నాటి మ్యానరిజమ్స్ గుర్తుకు తెస్తున్నాయి. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
హరీష్ శంకర్ తన మార్క్ మాస్ ఎలివేషన్లతో అదరగొట్టారు. ఇంటెన్స్ సీన్లు, గుర్రపు స్వారీ, విలన్లను చితకబాదే సన్నివేశాలు ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలవగా, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్రలో మెరిశారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్‌ను పొందింది.
రేపే ప్రీ-రిలీజ్ ఈవెంట్..
ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన చిత్ర యూనిట్, రేపు (మార్చి 15, ఆదివారం) హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో ఆయన ఇచ్చే స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'ఉస్తాద్' గర్జన మొదలుకానుంది. ట్రైలర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న భగత్ సింగ్, బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.






